eSahithiSite - Logo
Phone Icon (845)-735-2426
Cart Cart

Shop Now


Shop by Category

సత్యభామ

SKU: IBID-BSRAO-0005 $12.99

సత్రాజిత్తు మానవునిలోని దురహంకారానికి, దురుసుతనానికి, స్వార్థసంకీర్ణవ్యక్తినిష్ఠకూ ప్రతీకంగా నిలుస్తాడు. అతని అహంకారానికి రెండుమణులు కారణాలయ్యాయి. ఒకటి శ్యమంతకమణి, ఆ మణి నెపాన, బంగారురజనను అమాయక భల్లూక ప్రజనుండి కొల్లగొట్టి యాదవులలో సర్వశ్రేష్ఠునిగా తనను నిలుపుకోదలచడమే కాక, అశ్వమేథయాగాన్ని చేసి తన సార్వభౌమశక్తిని పృథ్వి ఎడదలో ప్రతిష్ఠించుకో కలలుకనిన అమితాశాపరుడు. ఆ శ్యమంతకం నుండి వేరైతేనే కాని అతని మార్పు ప్రారంభం కాదు. మరో మణి సత్యభామామణి. పరమసౌందర్య, లావణ్యరాసిగా, దర్పగర్వాలనేకాక, తండ్రి సంపాదించిన వైభవాన్ని ప్రదర్శించి, శ్రీ కృష్ణుణ్ణి వశపరచుకోవాలని ప్రయత్నించిన యువతి. ఆమె సచ్ఛీల, అనురాగజీవి, పరమసాహసి – ఈ గుణాలతో శ్రీ కృష్ణుని వెంట నడవాలంటే తన దర్ప, గర్వాలను, వైభవప్రాగల్భ్యాలను తృణీకరించి పరమపురుషునికి అకించనురాలిగా తనను అర్పణ చేసుకుంటేనే, తామస ప్రేమ నుండి, సాత్విక సమర్పణ దాకా ఎదిగితేనే ధన్యజీవి కాగలుగుతుంది. ఈ గాథను లభించిన ఆధారాలతో ‘సత్యభామ’ను ఊహల అల్లికతో చక్కగా, పఠనీయంగా రచించినదీ ఈ అయిదవభాగం.

Category:Books