eSahithiSite - Logo
Phone Icon (845)-735-2426
Cart Cart

Shop Now


Shop by Category

మోహన మురళి

SKU: IBID-BSRAO-0001 $12.99

ఒక అలౌకిక మహావిభూతి పుట్టడానికి సహేతుకమైన కారణం ఉండాలి. పృథ్వీ శ్రీమన్నారాయణుని వద్దకు వచ్చి తననుద్ధరించమని వేడుకుంటుంది. ఆయన ఎప్పుడు పుట్టినా ధర్మరక్షణకే. ఇనుప సంకెళ్ళలో మ్రగ్గుతున్న ఆ తల్లి దేవకీ గర్భాన కారాగారంలో పుట్టడంతో సరిపోలేదు. ఎందరెందరు ఆయన రాకకు ఎదురుచూచారో - అర్ధరాత్రి, చీకటిలో, ఉరుములు మెరుపుల మధ్య వర్షంలో పురిటి గ్రుడ్డును - నీలమేఘశ్యాముని యమునను దాటించడం, ప్రజలను కష్టాల కడలి నుండి దాటించడమే. ఆ తరువాత ఆయన పెరుగుదల, ఆయన వేణుగాన సుధామధురిమలు, కంస ప్రేరితమైన దాడులను త్రిప్పికొట్టి రాధా మనోహరుడై, గోపగోపీజన వల్లభుడై, యశోదానందుల ఆనందనిధానుడై, చివరికి కంస వధతో తన జీవన కార్యాన్ని ప్రారంభించిన కృష్ణ కథ చరాచరాలను ముగ్ధమొనరించిన 'మోహన మురళి'
విషయసూచిక
1) దేవకీ వసుదేవుల వివాహం, 2) కంస దురాగ్రహం, 3) కంస వ్యూహం, 4) అక్రూరుడు, 5) కంసుని అనుమానం, 6) వ్యాసవాణి, 7) హస్తినాపురంలో, 8) మధురలో నందుడు, 9) బలరాముని జననం, 10) అష్టమ గర్భం, 11) కంసుని కుట్ర, 12) నామకరణం, 13) గోకులంలో పూతన, 14) తృణావర్తుడు, 15) కృష్ణుని స్వగతం, 16) గోపికా వస్త్రాలు, 17) రెండు చెట్లు, 18) మధురకు తిరిగి రాక, 19) రాధ, 20) కాలం గడిచింది, 21) పిచ్చిసాహసం, 22) కాళీయమర్దనం, 23) రాధ పెండ్లి, 24) అయ్యన్ రాక, 25) గోవర్ధనోద్ధరణ, 26) వృద్ధమంత్రి, 27) కంసాదేశం, 28) మధురకు పిలుపు, 29) రసాధి దేవత, 30) మధురకు, 31) అంధకుని హెచ్చరిక, 32) త్రివిక్ర, 33) యజ్ఞ ధనువు, 34) మావటీడు, 35) కువలయాపీడం, 36) చాణూర మల్లుడు, 37) భవిష్యవాణి నెరవేరింది

Category:Books